ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలేరమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన

ABN, First Publish Date - 2022-09-13T06:16:20+05:30

ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహించే పోలేరమ్మ జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి సోమవారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరిటౌన్‌, సెప్టెంబరు 12: ఈనెల 14, 15 తేదీల్లో నిర్వహించే పోలేరమ్మ జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి సోమవారం పరిశీలించారు. జాతర ప్రాముఖ్యత గురించి ఎమ్మెల్యే ఎస్పీకి వివరిం చారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కల్గకుండా చూడాలన్నారు. సర్వదర్శనం, రూ.100, రూ.200, రూ. 500, అమ్మవారి కిరీటం కోసం విరాళాలు అందించిన భక్తులకు ప్రత్యేకంగా క్యూలైను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నాలుగు క్యూలు ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి మొదలై ఆర్చి వద్ద బయటకు వెళుతారని తెలిపారు. బొమిడికాలువ ద్వారా కూడా సర్వదర్శనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీవీఐపీ, వీఐపీ దర్శనాలు ఆర్చిగుంట పోలేరమ్మ ఆలయం వద్దకు పోయి తిరిగి మళ్లీ ఆర్చి వద్దకు వచ్చి బయటకు వెళ్తారని అన్నారు. ఆర్చి సెంటరు వద్ద వీఐపీ గ్యాలరీ, పోలీసు గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరారు. అమ్మవారి ఊరేగింపు సమయంలో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. సవారి గుంట వద్ద ఉన్న పోలేరమ్మ విరూప మండపం వద్దకు అమ్మవారు పోయేవరకు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జాతరను పురష్కరించుకుని పట్టణంలోని 92 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. తమకు ఏదైనా ఇబ్బంది కల్గినప్పుడు పోలీస్‌ కంట్రోల్‌ రూము నంబర్లు 94415 41321, 08625-295015కు ఫోన్‌ చేయొచ్చన్నారు. అనంతరం ఆయన పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విరూప మండపం, పోలీస్‌ స్టేషన్‌లో హెల్ప్‌లైన్‌ కేంద్రం, సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మద్దిల గురుమూర్తి,  ఎస్పీ పరమేశ్వరరెడ్డి, డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి, మున్సిఫల్‌ చైర్‌పర్సన్‌ నక్కా భానుప్రియ, వెంకటేశ్వరరావు, కోటీశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-13T06:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising