ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్వీయూలో ఏసీల వేతనాల పెంపు పాలకమండలి సమావేశంలో నిర్ణయం?

ABN, First Publish Date - 2022-03-05T07:52:26+05:30

ఎస్వీయూలో పనిచేస్తున్న అకడమిక్‌ కన్సల్టెంట్‌(ఏసీ)ల వేతనాలను రూ.35వేలకు పెంచుతూ పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), మార్చి 4: ఎస్వీయూలో పనిచేస్తున్న అకడమిక్‌ కన్సల్టెంట్‌(ఏసీ)ల వేతనాలను రూ.35వేలకు పెంచుతూ పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఎస్వీయూ పాలకమండలి సమావేశం శుక్రవారం సాయంత్రం అనంతపురంలోని జేఎన్‌టీయూలో నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్‌ కె.రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి, ఆమోదాలు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగుల టైంస్కేల్‌ అంశంపై చర్చించి, నిర్ణయాన్ని వచ్చే పాలకమండలి సమావేశానికి వాయిదా వేశారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోలపై చర్చించి, అమలుపై నిర్ణయం తీసుకున్నారు. నూతన ప్రైవేట్‌ కళాశాలల ఏర్పాటు, వెదురుకుప్పంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సౌకర్యాల కల్పనపై ఆమోదం తెలిపారు. నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీగా నియమితులైన రెక్టార్‌గా పనిచేస్తుండిన సుందరవల్లికి పాలకమండలి అనుమతిచ్చింది. అలాగే ప్రస్తుతం రెక్టార్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డి నియామకానికి ఓకే చెప్పింది. స్నాతకోత్సవం నిర్వహణకు పాలకమండలి ఆమోదం తెలిపారు. ఎప్పుడన్నది ఖరారు చేయాల్సి ఉంది. ఈ సమావేశంలో రెక్టార్‌తోపాటు రిజిస్ట్రార్‌ మహ్మద్‌ హుస్సేన్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, పాలకమండలి సభ్యులు ఎం.హనుమంతరావు, ఎం.భాస్కర్‌రెడ్డి, సి.ద్వారకనాథరెడ్డి, జి.మాధవి, పరమగీతం, ఎం.మధు, బెనజీర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T07:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising