ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగని వాన

ABN, First Publish Date - 2022-11-13T01:18:05+05:30

జిల్లావ్యాప్తంగా శుక్రవారం మొదలైన వర్షాలు శనివారం కూడా కొనసాగాయి. 20 మండలాల పరిధిలో మోస్తరు వానలు కురవగా మిగిలిన చోట్ల జల్లులు కురిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

20మండలాల్లో మోస్తరు వర్షం...

ఇతర చోట్ల జల్లులు

తిరుపతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా శుక్రవారం మొదలైన వర్షాలు శనివారం కూడా కొనసాగాయి. 20 మండలాల పరిధిలో మోస్తరు వానలు కురవగా మిగిలిన చోట్ల జల్లులు కురిశాయి. అత్యధికంగా పెళ్ళకూరులో 65.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా వాకాడు మండలంలో 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం సంభవించింది.సత్యవేడులో 57.8. తిరుపతి రూరల్‌లో 54.6, రామచంద్రాపురంలో 53, వడమాలపేటలో 52.2, బీఎన్‌ కండ్రిగలో 51.6, చంద్రగిరిలో 51.2, తడలో 44.2, ఏర్పేడులో 43.6, నాగలాపురం, వరదయ్యపాలెం, పిచ్చాటూరు మండలాల్లో 40.2 చొప్పున బాలయపల్లిలో 39.6, వెంకటగిరిలో 36, కేవీబీపురంలో 35.4, సూళ్ళూరుపేటలో 35, తిరుపతి అర్బన్‌లో 33.6, నారాయణవనంలో 32.2, శ్రీకాళహస్తిలో 31.6, పుత్తూరులో 30.4, పాకాలలో 30.2, ఓజిలి, రేణిగుంట మండలాల్లో 29.8 చొప్పున, తొట్టంబేడులో 29.6, చిల్లకూరులో 28.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. జిల్లావ్యాప్తంగా శనివారం 34.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈనెలలో సాధారణ వర్షపాతం 288.9 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకూ 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాయుడుపేట, పిచ్చాటూరు, నాగలాపురం మండల కేంద్రాల్లో వర్షానికి రోడ్లు జలమయ్యాయి. రోడ్లపై నీళ్ళు నిలిచిపోయి మడుగులను తలపించాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. జిల్లావ్యాప్తంగా కూడా వర్షాలు జనజీవనానికి అంతరాయం కలిగించాయి.డక్కిలి మండలం ఎల్లావజ్జలపల్లి గ్రామ సమీపంలో వున్న అలపలేరు డ్యామ్‌ కట్టకు శనివారం ఉదయం రంధ్రం పడింది.రైతులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి నీటి వృధాను అరికట్టారు. ఇది మినహా మరెలాంటి ఆస్తి, పంట నష్టాలు సంభవించలేదు.

Updated Date - 2022-11-13T01:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising