ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టమోటాకు కొమ్ములొచ్చాయ్‌!

ABN, First Publish Date - 2022-05-17T05:46:54+05:30

సోమవారం రామకుప్పంలోని మినీమార్కెట్‌ యార్డులో టమోటా మండీకి వచ్చిన టమోటాల్లో ఓ కాయ అందరినీ ఆకట్టుకుంది.

కొమ్ములు వచ్చినట్టుగా ఉన్న టమోటా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామకుప్పం, మే 16: సోమవారం రామకుప్పంలోని మినీమార్కెట్‌ యార్డులో టమోటా మండీకి వచ్చిన టమోటాల్లో ఓ కాయ అందరినీ ఆకట్టుకుంది. ఆ టమోటాపై తెల్లగా రెండు కొమ్ములు వచ్చినట్టుగా ఉంది. దాన్ని చూసిన రైతులు, వ్యాపారులు  15కిలోల బాక్సు ధర రూ.950  నుంచి రూ.1100 వరకు పలుకుతుండటంతో టమోటాకు కొమ్ములొచ్చినాయిబ్బా... అంటూ వ్యాఖ్యానించారు.


పెరిగిన ధరలు...  తోటల్లో టమోటా చోరీలు


సోమల: టమోటా ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదే అదునుగా కొందరు తోటల్లో కాయల చోరీకి తెగబడుతున్నారు. ఇన్ని రోజులు ధర లేక బాధపడ్డ రైతులు, తరువాత విద్యుత్‌ కోతలతో అల్లాడారు. ఈక్రమంలో ఇప్పుడు దొంగలనుంచి తమ పంటను కాపాడుకోవడానికి జాగారం చేస్తున్నారు. ప్రస్తుతం టమోటా 15కిలోల బాక్స్‌ ధర రూ.900కు చేరుకుంది. శనివారం రామకుప్పం మార్కెట్‌లో అయితే 15కిలోల బాక్స్‌ ఏకంగా రూ.1,150 పలికింది. బహిరంగ మార్కెట్‌లో అయితే కిలో రూ.100కు పైనే. ఈనేపథ్యంలో చిల్లర దొంగలు రాత్రి వేళ్లల్లో టమోటా తోటల్లోని కాయలను కోసుకెళ్తున్నట్టు రైతులు వాపోతున్నారు. శనివారం రాత్రి చిన్న సోమల మార్గంలోని రోడ్డు పక్కనే ఉన్న రైతు నవీన్‌ కు చెందిన తోటలో సమారు ఐదు బాక్సుల మేర టమోటా కాయలను గుర్తు తెలియని వ్యక్తులు కోసుకెళ్లినట్టు తెలిపారు. దీంతో చేసేది లేక రైతులు తోటల వద్ద రాత్రి పూట కాపలా కాస్తున్నారు.  

Updated Date - 2022-05-17T05:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising