ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోలాహలంగా ఉత్తర గోగ్రహణం

ABN, First Publish Date - 2022-05-22T06:00:16+05:30

సోమల మండలంలోని ఇరికిపెంట పంచాయతీ భారతంమిట్టలో మహాభారత ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉత్తర గోగ్రహణ ఘట్టం కోలాహలంగా సాగింది.

భారతంమిట్టలో విహరిస్తున్న పంచపాండవ వేషధారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమల, మే 21: మండలంలోని ఇరికిపెంట పంచాయతీ భారతంమిట్టలో మహాభారత ఉత్సవాల్లో  భాగంగా  శనివారం ఉత్తర గోగ్రహణ ఘట్టం   కోలాహలంగా సాగింది. ఉదయం ధర్మరాజుల ఆలయంలో పంచపాండవలు, ద్రౌపదిదేవి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పాండవులు అజ్ఞాతవాసంలో ఉండగా విరాటరాజు రాజ్యంలో పంటలు బాగా పండి ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండడం వేగుల ద్వారా దుర్యోధనుడు తెలుసుకుంటాడు. పాండవులు కూడా ఆ ప్రాంతంలోనే ఉంటారని దుర్యోధనుడు తన సైన్యంతో విరాటుని పశువులను తోలుకుని వెళ్తుంటే అర్జునుడు యుద్ధం చేసి వారి నుంచి పశువుల రక్షించి వెనక్కు తీసుకువస్తాడు. గోవులను తీసుకొచ్చిన అర్జునుడిని, ఉత్తర రాకుమారుడికి ప్రజలు ఘనస్వాగతం పలుకుతారు. ఈక్రమంలో  పంచపాండవుల విగ్రహాలను  పుష్ప పల్లకీలో అధిష్టింపజేసి భారతంమిట్ట, రాశెట్టివారిపల్లె, దాసరివాపల్లె, గన్నావారిపల్లె, వడ్డిపల్లెల్లో ఊరేంచారు. అలాగే గ్రామాల్లోని పశువులను పూలతో అలంకరించి ధర్మరాజుల ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈకార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్క గ్రామాల ప్రజలు భారతంమిట్టకు చేరుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఉభయదారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయంలో పూజలు జరిపి పశువుల యజమానులకు కానుకలు అందజేశారు. 


Updated Date - 2022-05-22T06:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising