వైభవంగా 500 పార్థివలింగాలకు అభిషేకాలు
ABN, First Publish Date - 2022-11-23T23:30:38+05:30
కార్తీక మాసం బహుళ అమావాస్య రోజైన బుధవారం పుంగనూరు కోనేరులో 500 పార్థివ లింగాలకు ఏకకాలంలో అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
పుంగనూరు, నవంబరు 23: కార్తీక మాసం బహుళ అమావాస్య రోజైన బుధవారం పుంగనూరు కోనేరులో 500 పార్థివ లింగాలకు ఏకకాలంలో అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు అన్నపూర్ణాదేవి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. అక్కడినుంచి పుష్కరిణిని వద్దకు స్వామిఅమ్మవార్లను వేంచేపు చేశారు. అనంతరం పుష్కరిణిలో ఏకకాలంలో అన్నిరకాల అభిషేకాలు, రుద్రం, నమకచమక, ప్రాణప్రతిష్ట సహిత కాలాభిషేకాలు శాస్త్రోక్తంగా చేట్టారు. మహిళలు, భక్తులు కోనేరులో దీపారాధన చేస్తూ శివనామస్మరణ చేశారు. ఆలయ ప్రాకారం చుట్టూ ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈసందర్భంగా అర్చకులు పార్థివ లింగపూజ ప్రాముఖ్యాన్ని వివరించారు.
Updated Date - 2022-11-23T23:30:42+05:30 IST