ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నింగికెగసిన ఆనందం..ఆ వెంటనే నిరాశ

ABN, First Publish Date - 2022-08-08T06:49:22+05:30

ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకుపోతుండగా సందర్శకుల ఉత్సాహం సైతం రాకెట్‌ను వెంబడిస్తూ గగనాన్ని తాకింది.

దూసుకుపోతున్న ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్‌ విజిటర్స్‌ గ్యాలరీలో సందడి చేసిన సందర్శకులు

శ్రీహరికోట (సూళ్లూరుపేట), ఆగస్టు 7 : ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకుపోతుండగా సందర్శకుల ఉత్సాహం సైతం రాకెట్‌ను వెంబడిస్తూ గగనాన్ని తాకింది. ఆదివారం షార్‌లో ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్‌ ప్రయోగాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో సందర్శకులు విచ్చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే షార్‌కు వెళ్లే మార్గం వాహనాలతో కిటకిటలాడిపోయింది. తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వివిధ వాహనాల్లో విచ్చేశారు. నెలల బిడ్డతో కూడా ఈ ప్రయోగాన్ని చూడ్డానికి తల్లిదండ్రులు రావడం కన్పించింది. ఇలా వేలాది సందర్శకులతో షార్‌ విజిటర్స్‌ గ్యాలరీ నిండిపోయింది. ఆకాశంలో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోతున్న రాకెట్‌ను కేరింతలు కొడుతూ జాతీయ పతాకాలను రెపరెపలాడిస్తూ వీక్షించిన సందర్శకులు సందడి చేశారు.ఇస్రో అధికారులు గ్యాలరీలో భారీ స్ర్కీన్లు సైతం ఏర్పాటు చేసి కనుచూపుమేర దాటిపోయిన రాకెట్‌ గమనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 13నిమిషాల్లో రాకెట్‌ ఉపగ్రహాలను కక్ష్యలో వదిలిపెట్టిందని ప్రసారం కావడంతో సందర్శకులు జయజయధ్వానాలు చేశారు.కొద్ది సేపటికి రాకెట్‌ నింగిలోకి దూసుకుపోయినా లక్ష్యాన్ని చేరలేదన్న విషయం తెలిసినా ఆకాశంలో రాకెట్‌ పయనాన్ని చూసిన సంతృప్తితో తిరుగుముఖంపట్టారు. 

Updated Date - 2022-08-08T06:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising