ఎద్దు తన్నడంతో రైతు మృతి
ABN, First Publish Date - 2022-10-17T07:39:56+05:30
ఎద్దు తన్నడంతో మండలంలోని పాపసముద్రం హరిజనవాడకు చెందిన రైతు రేణు(55) మృతిచెందాడు.
గుడిపాల, అక్టోబరు 16 : ఎద్దు తన్నడంతో మండలంలోని పాపసముద్రం హరిజనవాడకు చెందిన రైతు రేణు(55) మృతిచెందాడు. కొత్తగా పట్టుకొచ్చిన ఎద్దులకు ఇంటి వద్ద కసువు వేస్తుండగా వాటిలో ఒకటి రొమ్ముమీద తన్నడంతో అక్కడే పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే చీలాపల్లె సీఎంసీలో చేర్పించారు. చికిత్స పొందు తూ మృతి చెందాడు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
Updated Date - 2022-10-17T07:39:56+05:30 IST