ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్టాండులో బిడ్డను మర్చిపోయారు!

ABN, First Publish Date - 2022-08-10T06:59:13+05:30

తిరుపతి ఆర్టీసీ బస్టాండులో ఓ బాలుడిని తల్లిదండ్రులు మర్చిపోయారు. డ్యూటీలోని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి ఆ చిన్నారిని కన్నవారి చెంతకు చేర్చారు.

తల్లికి చిన్నారిని అప్పగిస్తున్న ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(కొర్లగుంట), ఆగస్టు 9: తిరుపతి ఆర్టీసీ బస్టాండులో ఓ బాలుడిని తల్లిదండ్రులు మర్చిపోయారు. డ్యూటీలోని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి ఆ చిన్నారిని కన్నవారి చెంతకు చేర్చారు. తూర్పుగోదావరిజిల్లా సీతానగరానికి చెందిన ఆర్‌.గణపతి కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనార్థం రెండ్రోజుల కిందట తిరుమల వచ్చారు. తిరుగుప్రయాణంలో మంగళవారం మధ్యాహ్నం తిరుపతి ఆర్టీసీ బస్టాండుకు వచ్చారు. బస్సులు అందుబాటులోకి లేకపోవడంతో రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అయితే బస్టాండు ఆవరణలో ఆడుకుంటున్న బాలుడిని మర్చిపోయారు. ఆ సమయంలో ఆర్టీసీ సెక్యూరిటీ ఎస్‌ఐ శ్రీహరి, హెడ్‌కానిస్టేబుల్‌ కె.ఎ్‌స.రావు, కానిస్టేబుళ్లు ఎ.కొండారెడ్డి, పి.ఎ్‌స.మహీధర్‌ రౌండ్స్‌లో ఉన్నారు. చెన్నై పాయింట్‌ వద్ద ఏడుస్తున్న చిన్నారిని గుర్తించి బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా అనౌన్స్‌ చేయించారు. కాసేపటికి ఆ బాలుడి తల్లి సెక్యూరిటీ కేంద్రానికి చేరుకున్నారు. తన కుమారుడు ఆర్‌.జోసిత్‌సత్యవెంకట్‌ అని చెప్పగా.. సెక్యూరిటీ సిబ్బంది నిర్ధారించుకున్నాక బాలుడిని కన్నవారికి అప్పగించారు. ఈ సందర్భంగా సిబ్బందిని బస్టాండు ఏటీఎం డి.రామచంద్రనాయుడు అభినందించారు. 

Updated Date - 2022-08-10T06:59:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising