ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కుల్లేకుంటే జరిమానా

ABN, First Publish Date - 2022-01-19T06:57:25+05:30

కొవిడ్‌ నిబంధనల అమలుపై మంగళవారం పోలీసులు తిరుపతి నగరంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపి(నేరవిభాగం), జనవరి 18: కొవిడ్‌ నిబంధనల అమలుపై మంగళవారం పోలీసులు తిరుపతి నగరంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించారు. జిల్లాలో మళ్లీ కొవిడ్‌ విజృంభిస్తున్నప్పటికీ చాలామంది మాస్కులు లేకుండానే తిరుగుతున్న నేపథ్యంలో నో మాస్క్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని పోలీసు అధికారులను ఎస్పీ వెంకటఅప్పలనాయుడు ఆదేశించారు. ఆ మేరకు నగరంలోని అన్నారావు కూడలి, కపిలతీర్థం, లీలామహల్‌, లక్ష్మీపురం, అన్నమయ్య, ఎం.ఆర్‌.పల్లె, బాలాజీ కాలనీ, కార్పొరేషన్‌ కార్యాలయం తదితర కూడళ్లలో పోలీసులు సాయంత్రం తనిఖీలు చేపట్టారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్‌చేసి జరిమానా విధించారు. స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసులను దూరంనుంచి గమనించిన కొందరు వాహనాలను వెనక్కు తిప్పుకుని వెళ్లే ప్రయత్నం చేయడం కనిపించింది. మాస్కులు ధరించనివారికి కొవిడ్‌ నిబంధనల గురించి వివరించి, మాస్కులు ధరించకుంటే నష్టాలను తెలియజేశారు. జరిమానా వేశారు. 

Updated Date - 2022-01-19T06:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising