ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర సమరయోధుడు టీసీరాజన్‌కు ఘనసన్మానం

ABN, First Publish Date - 2022-08-09T05:30:00+05:30

స్వాతంత్య్ర సమరయోధుడు, పలమనేరు మాజీ శాసనసభ్యుడు టీసీరాజన్‌ను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాజన్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎస్‌ఎం.పవిత్ర, మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌ కుప్పస్వామి, ఎంపీడీవో విద్యాసాగర్‌ శాలువలు కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు.

పలమనేరులో మంగళవారం స్వాతంత్య్రసమరయోధులు టీసీ రాజన్‌ ను సన్మానిస్తున్న మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు, ఆగస్టు 9: స్వాతంత్య్ర సమరయోధుడు, పలమనేరు మాజీ శాసనసభ్యుడు టీసీరాజన్‌ను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా రాజన్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎస్‌ఎం.పవిత్ర, మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌ కుప్పస్వామి, ఎంపీడీవో విద్యాసాగర్‌ శాలువలు కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఇక మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌... రాజన్‌కు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా టీసీ రాజన్‌ మాట్లాడుతూ...  తామంతా ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నామని, స్వాతంత్య్రం అనంతరం దేశంలో పరిపాలనలో క్రమేపీ స్వార్థం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వినోభాబావే స్ఫూర్తితో తన తండ్రినుంచి సంక్రమించిన భూములను, ప్రభుత్వం నుంచి అందిన సహాయాన్ని ప్రజల కోసం పంచి పెట్టానన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మున్సిపల్‌ కౌన్సిలర్లు, మున్సిపల్‌ మేనేజర్‌ ఖాదర్‌మోహిద్దీన్‌, పలమనేరు శానిటరీ ఇన్‌ఛార్జి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising