ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టమోటా ధరల పతనం

ABN, First Publish Date - 2022-06-26T06:02:32+05:30

గత నెల మొదటి వారంలో ఆకాశన్నంటిన టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రామకుప్పం, కుప్పం, పలమనేరు, ఏడోమైలు మార్కెట్లలో 15కిలోల బాక్సు శుక్రవారం వరకు రూ.400నుంచి రూ.450 వరకు పలికిన ధరలు శనివారం రూ.350 నుంచి రూ.400కు పడిపోయాయి.

రామకుప్పం మార్కెట్‌కు తరలివచ్చిన టమోటాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామకుప్పం/ సోమల, జూన్‌ 25: గత నెల మొదటి వారంలో ఆకాశన్నంటిన టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రామకుప్పం, కుప్పం, పలమనేరు, ఏడోమైలు మార్కెట్లలో 15కిలోల బాక్సు శుక్రవారం వరకు రూ.400నుంచి రూ.450 వరకు పలికిన  ధరలు శనివారం రూ.350 నుంచి రూ.400కు పడిపోయాయి. ఇదే సమయంలో సోమల మార్కెట్‌లో అయితే 15కిలోల బాక్స్‌ ధర రూ.300 పలికింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అధిక దిగుబడులు రావడంతోపాటూ జిల్లావ్యాప్తంగా  రైతులు తాము పండించిన టమోటాలను మార్కెట్లకు తరలిస్తుండడంతో ధరలు తగ్గుతున్నాయి. వారం రోజుల క్రితం మచ్చలు కల్గిన, చిన్నసైజు కాయల బాక్సు రూ.250 నుంచి రూ.350 వరకు పలికింది. ప్రస్తుతం అటువంటి కాయలు కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. బాక్సు ధర రూ.350 వరకు పలికితే పెట్టుబడి గిట్టుబాటై కాస్తోకూస్తో లాభాలు వస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. టమోటా ధరలు తగ్గడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు.  ప్రస్తుతం కిలో  రూ.30 నుంచి రూ.40కు కొనుగోలు చేస్తున్నారు.


Updated Date - 2022-06-26T06:02:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising