ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1500 మంది దాటితే అదనపు పోలింగ్‌ కేంద్రం

ABN, First Publish Date - 2022-10-05T06:29:08+05:30

జిల్లాలో 1500 మందికి మించి ఓటర్లు ఉంటే ఆ ప్రాంతంలో అదనంగా మరో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీఆర్వో ఎస్‌.రాజశేఖర్‌ అన్నారు.

రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడుతున్న డీఆర్వో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వచ్చేనెల 7లోగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలి ఫ పాత ఓటర్ల జాబితాలు చెల్లవు

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 4: జిల్లాలో 1500 మందికి మించి ఓటర్లు ఉంటే ఆ ప్రాంతంలో అదనంగా మరో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డీఆర్వో ఎస్‌.రాజశేఖర్‌ అన్నారు. చిత్తూరులోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌హాలులో మంగళవారం ఆయన తహసీల్దార్లు, ఎలక్షన్‌ డీటీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. గతంలోని 57 పోలింగ్‌ కేంద్రాలను పాత భవనాల నుంచి కొత్తవాటికి మార్చామన్నారు. ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలన్నారు. త్వరలో జరిగే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు 2017లో నమోదు చేసుకున్న పాత ఓటరు జాబితాలు చెల్లవన్నారు. అర్హులైనవారు తమ పేర్లను  నమోదు చేసుకోవాలన్నారు. 2019 అక్టోబరు 31వతేదీ నాటికి డిగ్రీ పూర్తిచేసిన వారే అర్హులన్నారు. ఓటరు నమోదు ఫారాలన్నీ ఆర్డీవో, తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవో, మున్సిపల్‌ కార్యాలయాలు, సచివాలయాల ద్వారా పొందవచ్చన్నారు. ఉపాధ్యాయ ఎన్నికలకు 2016 నవంబరు 1 నుంచి 2022 అక్టోబరు 31వరకు ఆరేళ్ల వ్యవధిలో కనీసం మూడేళ్లు టీచర్లుగా పనిచేసినవారే ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అర్హులన్నారు. వివరాలకు సచివాలయాలను సంప్రదించాలని సూచించారు. నేతలు సురేంద్ర కుమార్‌ (టీడీపీ), ప్రేమ్‌కుమార్‌ (వైసీపీ), కె.చిట్టిబాబు (బీజేపీ), జ్ఞానరాజు (సీపీఎం), కె.అశోక్‌కుమార్‌ (బీఎస్పీ), మురళి (జనసేన), తహసీల్దార్‌ పద్మజ, ఎలక్షన్‌ డిటి పార్థసారధి, ఎన్నికల విభాగ అధికారి ఉమాపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-05T06:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising