ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బేలుపల్లె సమీపంలో తవ్వకాలపై కలకలం

ABN, First Publish Date - 2022-05-30T05:59:34+05:30

బైరెడ్డిపల్లె మండలంలోని బేలుపల్లెకు వెళ్లే రహదారిలో గంగమ్మగుడి సమీపంలో దేవతామూర్తుల బొమ్మలు చెక్కివున్న రాతిబండల వద్ద ఎవరో తవ్వకాలు జరపడం కలకలం రేపుతోంది.

బేలుపల్లె సమీపంలో తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న మహిళా పోలీస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుప్తనిధుల కోసమేనని ప్రచారం 


బైరెడ్డిపల్లె, మే 29:  మండలంలోని బేలుపల్లెకు వెళ్లే రహదారిలో గంగమ్మగుడి సమీపంలో దేవతామూర్తుల బొమ్మలు చెక్కివున్న రాతిబండల వద్ద ఎవరో తవ్వకాలు జరపడం కలకలం రేపుతోంది. ఈ తవ్వకాలు  రెండురోజులకు ముందు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గుర్తుతెలియని దుండగులు ప్రాచీనకాలంనాటి రాతిబండల కింద నిధుల కోసం తవ్వకాలు జరిపి ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న  బేలుపల్లె సచివాలయ మహిళా పోలీస్‌ సుశీల సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బైరెడ్డిపల్లె పోలీసులు కూడా వెళ్లి వివరాలు  సేకరించారు. మూడు రాతిబండల్లో దుండగులు రెండింటిని పెకలించి వేసి మట్టితో పూడ్చిపెట్టారు. మరో రాతిబండను పాక్షికంగా పక్కకు తొలగించారు.   ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారిపై పోలీసులు నిఘా వేసి వుంచి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 


Updated Date - 2022-05-30T05:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising