ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరరాజాకు ఎనర్జీ ఎఫిషియెంట్‌ అవార్డు

ABN, First Publish Date - 2022-09-23T06:44:04+05:30

అమరరాజా పరిశ్రమలకు ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్‌ అవార్డు దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేణిగుంట, సెప్టెంబర్‌ 22 :అమరరాజా పరిశ్రమలకు ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్‌ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో రాయల్‌ డానిష్‌ ఎంబసీ అంబాసిడర్‌ హెచ్‌ఈ ప్రెడ్డీ స్వనే, బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ సెక్రటరీ ఆర్‌కె రాయ్‌ చేతుల మీదుగా ఈ అవార్డును అమరరాజా ప్రతినిధులు ఎం. సుభాష్‌, కె.వి. వినయ్‌సాగర్‌  గురువారం అందుకున్నారు. భారీ పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో  కాన్ఫెడరేషన్‌  ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ర్టీ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ నుండి ఆటోమోటివ్‌, ఇంజనీరింగ్‌ విభాగంలో ఈ అవార్డు అమరరాజాకు దక్కిందని అమరరాజా బ్యాటరీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గౌరినేని హర్షవర్ధన్‌ అన్నారు. భారీ పరిశ్రమల సమాఖ్య నుంచి ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఇంధన సామర్థ్యం, పర్యావరణ పద్ధతుల లక్ష్యాలకు కట్టుబడి  ఉన్నామని, ఈ దశలో అమరరాజా బ్యాటరీ్‌సలో పనిచేస్తున్న ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు. అమరరాజా బ్యాటరీస్‌ చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌ సి. నరసింహులు నాయుడు మాట్లాడుతూ అమరరాజా పునరుత్పాదక శక్తి, వ్యర్థాల వినియోగం, కార్సన్‌ ఫుట్‌ ప్రింట్‌ తగ్గింపు, గ్రీన్‌ సప్లై చైన్‌ ఇన్నోవేషన్‌ , ఇంధన సంరక్షణలో నిరంతర ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని, తమ బాధ్యత పెంచిందని తెలిపారు.ఈ పోటీలో ఆటోమోటివ్‌, ఇంజనీరింగ్‌ రంగంలో 67 కంపెనీలు పోటీ పడ్డాయన్నారు. చివరి రౌండ్‌లో 30 కంపెనీలు షార్ట్‌ లిస్టులో నిలిచాయన్నారు. ఆటో ఇంజనీరింగ్‌ సెక్టార్‌లో అమరరాజాతో పాటు అశోక్‌లేలాండ్‌, బజాజ్‌, హీరోహోండా లాంటి కంపెనీలు పోటీపడ్డాయన్నారు. 


Updated Date - 2022-09-23T06:44:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising