ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల కష్టాలతో మమేకం కండి

ABN, First Publish Date - 2022-11-30T23:37:22+05:30

ప్రజల కష్టాలతో మమేకమై, వారితోనే కలిసి ఉండాలని, వారి సాధకబాధకాలు తమవిగా భావించి పరిష్కారంకోసం పనిచేయాలని పలువురు టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కుప్పం పార్టీ కార్యాలయంలో బుఽధవారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు.

కుప్పంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పీఎస్‌.మునిరత్నం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమావేశంలో టీడీపీ నేతల పిలుపు

కుప్పం, నవంబరు 30: ప్రజల కష్టాలతో మమేకమై, వారితోనే కలిసి ఉండాలని, వారి సాధకబాధకాలు తమవిగా భావించి పరిష్కారంకోసం పనిచేయాలని పలువురు టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కుప్పం పార్టీ కార్యాలయంలో బుఽధవారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుప్పంలో గురువారంనుంచి ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం ప్రారంభముతుందన్నా. ఆయా పంచాయతీలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలతోపాటు పార్టీ ఇన్‌ఛార్జిలు, కార్యకర్తలు గ్రామాలకు తరలి అక్కడి ప్రజల్లోనే ఉండాలన్నారు. అధికార పార్టీ నేతలు చెబుతున్నంత సవ్యంగా, సంతృప్తిగా ప్రజలు లేరన్నారు. సంక్షేమ పథకాలు ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్నట్లు కనిపిస్తున్నా, ఏవేవో నిబంధనలతో చాలామందికి కోత పడిపోయిందని, అటువంటి వారంతా తీవ్ర అసంతృప్తి, అసహనాలతో ఉన్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ మూడున్నరేళ్ల కాలంలో పెరిగిపోయిన దౌర్జన్యాలు, దాడులు, హింస గురించి ప్రజల్లో చర్చ పెట్టాలన్నారు. సాక్షాత్తు చంద్రబాబు పర్యటననే అడ్డుకోవడం, అన్న క్యాంటీన్‌పై దాడులు చేయడం, తిరిగి టీడీపీ నేతలు, కార్యకర్తలపైనే తప్పుడు కేసులు బనాయించేలా పోలీసులమీద వొత్తిడి చేయడం వంటి దారుణాలు చాలా జరిగాయన్నారు. వీటన్నిటి గురించి గ్రామాల్లో ప్రస్తావించాలన్నారు. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదన్నారు. అందువల్ల నిర్భయంగా ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఒకవేళ అధికార పార్టీ ఏదైనా దౌర్జన్యాలకు దిగితే పార్టీ అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌.మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్‌, పార్టీ రూరల్‌ మండల అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, మాజీ ఎంపీపీ సాంబశివం, త్రిలోక్‌, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:37:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising