ఆరుగురిపై అదనపు కట్నం కేసు
ABN, First Publish Date - 2022-02-06T06:02:16+05:30
వివాహిత ఫిర్యాదు మేరకు ఆరుగురిపై అదనపు కట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ మురళీకృష్ణ చెప్పారు.
మదనపల్లె క్రైం, ఫిబ్రవరి 5: వివాహిత ఫిర్యాదు మేరకు ఆరుగురిపై అదనపు కట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ మురళీకృష్ణ చెప్పారు. పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన నాజియాకు 2017లో మదనపల్లె మండలం సీటీఎం గ్రామానికి చెందిన అఫ్జల్‌బాషాతో వివాహమైంది. కాగా నాజియా ప్రస్తుతం ఏడునెలల గర్భిణి. ఈనేపథ్యంలో అత్తింటివారు కొంతకాలంగా అదనపు కట్న వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో బాధితురాలు 2021లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అనంతరం లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకున్నారు. అయితే కొద్దిరోజులుగా మళ్లీ కట్న వేధింపులకు గురిచేస్తుండడంతో నాజియా శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు భర్త అప్జల్‌బాషా, అత్తా మామలు గపూర్‌సాబ్, మల్లికాబేగం, మరిది అస్లాంబాషా, తోడికోడలు షాజీనా, వదిన షమీంలపై కేసునమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
మరో నలుగురిపై...
పట్టణంలోని నక్కలదిన్నెతాండాకు చెందిన మౌనికకు రెండేళ్ల కిందట మండలంలోని కోటవారిపల్లెకు చెందిన కిశోర్‌తో వివాహమైంది. ఈక్రమంలో కొద్దిరోజులుగా అత్తింటివారు కట్నం కోసం వేధిస్తుండడంతో బాధితురాలు శనివారం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు భర్త కిశోర్, అత్తామామలు హరినాథ్, శంకరమ్మ, మరిది బద్రీనాథ్‌పై కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ లోకేశ్ చెప్పారు.
Updated Date - 2022-02-06T06:02:16+05:30 IST