ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబర్‌ 2న భూహక్కు పత్రాల పంపిణీ : జేసీ

ABN, First Publish Date - 2022-10-08T05:25:52+05:30

నవంబరు 2వ తేదీన జిల్లావ్యాప్తంగా భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని జేసీ వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జేసి వెంకటేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 7: నవంబరు 2వ తేదీన  జిల్లావ్యాప్తంగా భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని జేసీ వెంకటేశ్వర్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 100 శాతం భూ రికార్డుల నవీనీకరణ పూర్తయిన 137 గ్రామాల పరిధిలో పత్రాల పంపిణీ చేపడుతున్నామన్నారు. ఈనెల 25న ముద్రణ పూర్తి చేస్తామని చెప్పారు. 25-28 తేదీల మధ్య సర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే రాళ్లు నాటే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. నెలాఖరులోగా భూహక్కు పత్రాల పుస్తకాల్లో హక్కుదారుల పూర్తి వివరాల నమోదు, వెరిఫికేషన్‌ చేయాలని చెప్పారు. ఎక్కడైనా తప్పులు దొర్లితే అందుకు సర్వేయర్లు, తహసీల్దార్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పర్వీన్‌, డీఐవోలు, డీటీలు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-08T05:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising