ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెయ్యి హెక్టార్లు దాటిన పంట నష్టం

ABN, First Publish Date - 2022-12-15T00:59:31+05:30

వ్యవసాయ పంటలు 771.. ఉద్యాన పంటలు 406 హెక్టార్లు

విజయపురం మండలం పాతార్కాడులోని వేరుశనగ పంటలో నిలిచిన వర్షపునీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 14: మాండస్‌ తుఫాను కారణంగా జిల్లాలో వెయ్యి హెక్టార్లకు పైగా పంటలకు నష్టం వాటిల్లింది. 1177 హెక్టార్లలో (2942.5 ఎకరాలు) పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు తాజా గణాంకాల్లో పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ పంటలు 771, ఉద్యాన పంటలు 406 హెక్టార్లుగా ఉన్నాయి. వ్యవసాయ పంటల్లో అత్యధికంగా వరి 252.59 హెక్టార్లలో దెబ్బతింది. చెరకు 19.60, ఆముదం 0.80, వేరుశనగ 248.80, మినుములు 84, కందులు 11.31, రాగి 2, మొక్కజొన్న 151.94 హెక్టార్లుగా ఉంది. 924 మంది రైతులు సాగు చేసిన వంకాయ, అరటి, మిరప, టమోటా, తమలపాకులు, కాలీఫ్లవర్‌, కర్భూజా, ఉర్ల, పువ్వులు, బీన్స్‌, పప్పాయ, క్యాబేజి వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వీటి నష్టం రూ.6.58 కోట్లుగా అధికారులు లెక్క కట్టారు. బంగారుపాళ్యం మండలంలో 1.50 హెక్టార్లు పంట దెబ్బతినగా, చౌడేపల్లిలో 29.20, సోమలలో 8.60, పుంగనూరులో 44, పెద్దపంజాణి 13, పూతలపట్టులో 0.8, పెనుమూరులో 8.60, వెదురుకుప్పంలో 1.61, గంగవరంలో 9.60, రామకుప్పంలో 22.30, శాంతిపురంలో 48.91, కార్వేటినగరంలో 15.60, వి.కోటలో 47.80, జీడీ నెల్లూరులో 4.80, నగరిలో 13, నిండ్రలో 2, విజయపురంలో 27.40, ఎస్‌ఆర్‌ పురంలో 0.20, పులిచెర్లలో 9.10, రొంపిచెర్లలో 80 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పలమనేరులో టమోటా 0.80 హెక్టార్లు, బైరెడ్డిపల్లెలో బీన్స్‌ 0.80, సదుంలో పువ్వులు 2.40, కుప్పంలో టమోటా 5, చిత్తూరులో మిరప 8.60, పాలసముద్రంలో 0.80 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు తాజాగా లెక్క కట్టారు.

Updated Date - 2022-12-15T00:59:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising