ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘శ్రీనివాస సేతు’కు పగుళ్లా?

ABN, First Publish Date - 2022-10-17T07:05:50+05:30

తిరుపతిలో రెండు దశలుగా ప్రారంభమైన శ్రీనివాస సేతు (గరుడ వారధి)కు పగుళ్లు వచ్చాయంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ప్యానెల్స్‌ మధ్య వచ్చిన గ్యాప్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్‌ మీడియాలో వైరల్‌ 

అవి ప్యానెల్స్‌ మధ్య గ్యాప్‌ అంటూ సరిచేసిన నిర్మాణ సంస్థ ‘ఆఫ్కాన్స్‌’

తిరుపతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో రెండు దశలుగా ప్రారంభమైన శ్రీనివాస సేతు (గరుడ వారధి)కు పగుళ్లు వచ్చాయంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. లీలామహల్‌ సర్కిల్‌ సమీపంలోని వారధి పిల్లర్‌పై ఉన్న ప్యానెల్స్‌ మధ్య గ్యాప్‌ కనిపించడంతో పగుళ్లు వచ్చాయన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌, టీటీడీ సంయుక్తంగా రూ.684 కోట్ల బడ్జెట్‌తో తిరుచానూరు రోడ్డు మార్కెట్‌ యార్డు నుంచి కపిలతీర్థం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల ఫైఓవర్‌ నిర్మాణం జరుగుతోంది. తొలి దశలో శ్రీనివాసం నుంచి, మలి దశలో కరకంబాడి నుంచి ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. చివరి దశపనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో లీలామహల్‌ సమీపంలో ప్యానెల్స్‌ మధ్య గ్యాప్‌ వచ్చి పగుళ్ల మాదిరి కనిపించింది.ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నగరవాసుల్లో భయాందోళన మొదలైంది. గతంలో డీబీఆర్‌ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న వారధి పక్కకు ఒరిగిపోయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నిత్యం రద్దీగా ఉండే లీలామహల్‌ ప్రాంతంలో చీలిక కనిపించడంతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అటు అధికారులు, ఇటు నిర్మాణ సంస్థపై ఉంది. దీనిపై ఆఫ్కాన్స్‌ స్థానిక మేనేజర్‌ రంగస్వామి ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. వారధిలో పిల్లర్‌ నుంచి మరో పిల్లర్‌ మధ్య దాదాపు 40 మీటర్లు ఉంటుందన్నారు. ప్యానెల్స్‌ మధ్య గ్యాప్‌ వచ్చిన చోట ‘ఫేషియో ప్యానెల్స్‌’ ఏర్పాటు చేస్తామన్నారు. ఒక ప్యానెల్‌కు మరో ప్యానెల్‌ మధ్య చిన్నపాటి తేడా వల్ల గ్యాప్‌లు కనిపిస్తాయని, వాటివల్ల వారధికి ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. ఆ గ్యాప్‌లను కూడా సరిచేశామని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో ఆఫ్కాన్స్‌ భాగస్వామ్యం ఉందని ఈ సందర్భంగా చెప్పారు. కాగా రెండ్రోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఇప్పటివరకు అధికారులు వివరణ ఇవ్వకపోవడం బాధాకరమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌ కుమార్‌ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారధి నిర్మాణంలో నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలని డిమాండు చేశారు. 

Updated Date - 2022-10-17T07:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising