ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షికారీలు, రైతుల మధ్య మళ్లీ చెలరేగిన భూవివాదం

ABN, First Publish Date - 2022-09-13T06:29:08+05:30

ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయతీలో ఉన్న రైతులకు అదే పంచాయతీ మరాఠిపురం గ్రామంలో నివసిస్తున్న షికారీల మధ్య మళ్లీ భూ వివాదం చెలరేగింది.

షికారీలతో మాట్లాడుతున్న రేణిగుంట డీస్పీ చంద్రశేఖర్‌, ఏర్పేడు సీఐ శ్రీహరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వివాదాస్పద భూముల్లో దున్నకాలకు సిద్ధమైన షికారీలు ఫ అడ్డుకున్న రైతులు

- ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు

ఏర్పేడు, సెప్టెంబరు 12: ఏర్పేడు మండలం చింతలపాళెం పంచాయతీలో ఉన్న రైతులకు అదే పంచాయతీ మరాఠిపురం గ్రామంలో నివసిస్తున్న షికారీల మధ్య మళ్లీ భూ వివాదం చెలరేగింది. 20 ఏళ్ల నుంచి నడుస్తున్న ఈ వివాదంపై ఆరు నెలల క్రితం ఇరు వర్గాల వారు ఓ నిర్ణయానికి వచ్చారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఎవరూ ఆ భూముల్లోకి ప్రవేశించరాదని అధికారులు నిర్ణయిం చారు. ఆ మేరకు ఇప్పటివరకు ఎవరూ వెళ్లలేదు. 45 రోజుల క్రితం ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రవిబాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మరాఠీపురం గ్రామా న్ని సందర్శించి షికారీల భూసమస్యను అడిగి తెలుసుకున్నారు. అయినా ఓ పరిష్కారం చూపక పోవడంతో సోమవారు షికారీలు ఆ భూముల్లో దున్నకాలకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలు సుకున్న రైతులు దున్నకాలను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలేరిగింది. ఈ క్రమంలో షికారీలు దాడిచేశారని రైతులు పోలీ సులకు, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తాము ఎవరిపైనా దాడులు చేయలేదని షికారీలు పోలీసులకు తెలియజేశారు. రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్‌, ఏర్పేడు సీఐ శ్రీహరి, ఎస్‌ఐ రఫీ మరాఠిపురం గ్రామాన్ని సందర్శించారు. వివాదాస్పద భూములను పరిశీలించారు. అనం తరం షికారీలు, రైతులతో మాట్లాడారు. అధికా రులు పరిష్కారం చూపేవరకు వివాదాస్పద భూ ముల్లోకి ప్రవేశించవద్దని సూచిం చారు. దీనికి ఇరువర్గాల వారు ఒప్పుకోవడంతో వివాదం సద్దు మణిగింది. ఇదిలా ఉండగా షికారీల నుంచి రక్షణ కల్పించాలని చింతలపాళెం పంచాయతీలోని నాలు గు గ్రామాల రైతులు తహసీల్దార్‌ ఉదయ్‌సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సమస్య జిల్లా అధికారుల దృష్టిలో ఉందని  వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని రైతులకు ఆయన హామీ ఇచ్చి పంపారు. 

Updated Date - 2022-09-13T06:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising