ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్ దినచర్య: Tulasireddy

ABN, First Publish Date - 2022-03-22T18:01:47+05:30

మాట తప్పడం..మడమ తిప్పడం సీఎం జగన్ దినచర్య అని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: మాట తప్పడం.. మడమ తిప్పడం సీఎం జగన్ దినచర్య అని  ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కుప్పంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో తులసిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్ని సీట్లకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం కాంగ్రెస్‌కు ఉందన్నారు. అన్ని వర్గాలు అన్ని రంగాలు అన్ని ప్రాంతాలను జగన్ నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ, ప్రత్యేక హోదా జాబ్ క్యాలెండర్ అన్ని హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు వెంటనే రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాలన్నారు. జగన్ మోసాన్ని నిరుద్యోగ యువత గుర్తించి మేల్కోవాలని పిలుపునిచ్చారు. ఓటమి సహజం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే కాంగ్రెస్ విజయం రాష్ట్రంలో, దేశంలో తథ్యమని తులసిరెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-22T18:01:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising