ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగుల సమస్య పరిష్కారానికి ఆందోళన: కిసాన్‌మోర్చా

ABN, First Publish Date - 2022-05-22T06:04:09+05:30

జిల్లాలో రైతుల పంట నష్టం కలిగిస్తూ, ప్రజల ప్రాణాలను తీస్తున్న ఏ నుగుల సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు కిసాన్‌ మో ర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు మోర్చా జిల్లా అధ్యక్షుడు పి.సుబ్బా రెడ్డి పేర్కొన్నారు.

పలమనేరులో జరిగిన కిసాన్‌ మోర్చా సమావేశంలో మాట్లాడుతున్న సుబ్బారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలమనేరు, మే 21: జిల్లాలో రైతుల పంట నష్టం కలిగిస్తూ, ప్రజల ప్రాణాలను తీస్తున్న ఏ నుగుల సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు కిసాన్‌ మో ర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు మోర్చా జిల్లా అధ్యక్షుడు పి.సుబ్బా రెడ్డి పేర్కొన్నారు. శనివారం పలమనేరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈనెల 23వ తేది పలమనేరు బసవన్న గుడి వద్ద సమావేశానికి కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్య క్షుడు శశిభూషణ్‌ రెడ్డి హాజరవుతారని తెలి పారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఏనుగుల సమస్యల పరిష్కారం కోసం తీర్మానం చేసి పలమనేరు రెవిన్యూ డివిజిన్‌ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి వినతి పత్రం సమర్పిస్తామన్నారు.   ఏనుగుల దాడుల వల్ల జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఈ సమస్యను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు డేరంగుల సుబ్రమణ్యం, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, కార్యదర్శి కమటం ఉమాపతి, జిల్లా కోశాధికారి హేమచంద్రారెడ్డి,  పలమనేరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు అబ్బూరి తాతయ్యనాయుడు,  ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌.చిన్నబ్బ, బీజేపీ నాయకులు బసవలింగప్ప, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T06:04:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising