ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇకపై కూలంకుషంగా సమీక్షిస్తా: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-05-18T06:59:46+05:30

‘కొవిడ్‌ కారణంగా రెండేళ్లలో జిల్లా ప్రగతిపై అన్ని శాఖల సమీక్షలు అంతంతే చేశా. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఇకపై ప్రతి శాఖ పనితీరు, ప్రగతిని సమగ్రంగా, కూలంకుషంగా సమీక్షిస్తా. మీరిచ్చే నివేదికలను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తా.

హౌసింగ్‌ అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, మే 17: ‘కొవిడ్‌ కారణంగా రెండేళ్లలో జిల్లా ప్రగతిపై అన్ని శాఖల సమీక్షలు అంతంతే చేశా. ప్రస్తుతం కొవిడ్‌  తగ్గుముఖం  పట్టడంతో ఇకపై ప్రతి శాఖ పనితీరు, ప్రగతిని సమగ్రంగా, కూలంకుషంగా సమీక్షిస్తా. మీరిచ్చే నివేదికలను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తా. తప్పుడు వివరాలతో నన్ను మభ్య పెడితే చర్యలు తీసుకుంటా’ అని కలెక్టర్‌ హరినారాయణన్‌ హెచ్చరించారు. చిత్తూరు కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ శాఖల వారీగా ఆయన సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. ఇక అధికారులు అలసత్వం, నిద్రమత్తు వీడాలన్నారు. బాధ్యతగా పనిచేయండి. జిల్లాకు మంచిపేరు తేవాలని సూచించారు. వివిధ సమీక్షల్లో భాగంగా.. జగనన్న ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు వస్తున్నా రిజిస్ట్రేషన్లు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని హౌసింగ్‌ డీఈలను ప్రశ్నించారు. అన్ని పీహెచ్‌సీలు 24 గంటలు పని చేసేలా చూసి.. వంద శాతం కాన్పులు జరిగేలా చూడాలని ఆదేశించారు. అంగన్‌వాడి కేంద్రాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారుల వివరాలు సేకరించాలన్నారు. కేంద్రాల్లోని ఖాళీ పోస్టులను నెలాఖరులోగా భర్తీ చేయాలన్నారు.

Updated Date - 2022-05-18T06:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising