ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలినడక మార్గంలో నాగుపాము

ABN, First Publish Date - 2022-05-22T06:37:21+05:30

అలిపిరి కాలినడక మార్గంలో శనివారం ఓ నాగుపాము భక్తులను హడలెత్తించింది.

పట్టుబడిన పామును చూపుతున్న భాస్కర్‌ నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, మే 21 (ఆంధ్రజ్యోతి): అలిపిరి కాలినడక మార్గంలో శనివారం ఓ నాగుపాము భక్తులను హడలెత్తించింది. 3,500 మెట్టుకు సమీపానికి వచ్చిన పామును గుర్తించిన భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. దగ్గరల్లోని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి, పాములు పట్టే భాస్కర్‌నాయుడిని పిలిపించారు. ఆయన తన వద్దనున్న పరికరాలతో సుమారు ఆరడుగుల పొడవు కల్గిన నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. దాంతో అక్కడివారు ఊపిరిపీల్చుకున్నారు. తొలుత పామును చూసి భయంతో పరుగులు తీసిన భక్తులు దాన్ని పట్టుకున్నాక చూడటానికి ఎగబడ్డారు. సెల్‌ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ తర్వాత నాగుపామును భాస్కర్‌నాయుడు దట్టమైన అడవిలో విడిచిపెట్టారు. 

Updated Date - 2022-05-22T06:37:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising