ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్త్‌ వర్శిటీ పేరు మార్పు ఉన్మాద చర్య

ABN, First Publish Date - 2022-10-07T04:54:03+05:30

హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్చి, వైఎస్సార్‌ పేరు పెట్టడం ఉన్మాద చర్య అని టీడీపీ నేతలు విమర్శించారు.

కుప్పం మండలం మల్లానూరులో నిరశన దీక్ష చేస్తున్న టీడీపీ శ్రేణులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ విమర్శ


కుప్పం, అక్టోబరు 6: హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్చి, వైఎస్సార్‌ పేరు పెట్టడం ఉన్మాద చర్య అని టీడీపీ నేతలు విమర్శించారు. కుప్పం మండలం మల్లానూరులో గురువారం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తెలుగు ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని పేర్కొన్నారు. ఆయన పేదల కడుపు నింపిన అన్నదాత అని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల రాజ్యాన్ని స్థాపించడమేకాక, తెలుగుగంగ వంటి సాగు, తాగునీటి పథకాలను అమలు చేసి పక్క రాష్ట్రాల దాహం తీర్చిన అపర భగీరథుడిగా పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హెల్త్‌ యూనివర్శిటీని స్థాపించడమేకాక, వివిధ విశ్వవిద్యాలయాల కింద అవకతవకలుగా నడుస్తున్న మెడికల్‌ కాలేజీలన్నింటినీ ఆ గూటి కిందికి తెచ్చి వైద్య విద్యకు పట్టంగట్టిన మహనీయుడన్నారు. అటువంటి మహానుభావుడి పేరును మార్చి, అసలు యూనివర్శిటీకి ఏమాత్రం సంబంధంలేని వారి పేరును పెట్టడం దారుణమన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రభుత్వంపై ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు. కుప్పం రూరల్‌ మండల టీడీపీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.ఎస్‌.మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T04:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising