ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్త్‌ వర్శిటీ పేరు మార్పు ‘అధికార’ అరాచకం

ABN, First Publish Date - 2022-10-08T04:52:04+05:30

అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయచ్చన్న సీఎం జగన్‌ ప్రజల ఆకాంక్షలను కూడా కాలరాసి ఇష్టారాజ్యంగా అరాచక పాలన సాగిస్తున్నారని పలువురు టీడీపీ నేతలు విమర్శించారు.

కుప్పంలో టీడీపీ ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధ్వజమెత్తిన టీడీపీ


కుప్పం, అక్టోబరు 7: అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయచ్చన్న సీఎం జగన్‌ ప్రజల ఆకాంక్షలను కూడా కాలరాసి ఇష్టారాజ్యంగా అరాచక పాలన సాగిస్తున్నారని పలువురు టీడీపీ నేతలు విమర్శించారు. హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించి వైఎస్సార్‌ పేరును పెట్టాలని నిర్ణయించడం ఆయన పాలనా అరాచకానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట శుక్రవారం నిరశన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాని సీఎం  జగన్‌, ఏవేవో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ రోజుకో కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ పట్ల ఎంతో గౌరవం ఉన్నదని చెప్పుకునే ఆయన ఆ మహనీయుడి పేరు ఎందుకు మార్చారని నిలదీశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ప్రపంచంలోని మొత్తం తెలుగువారికంతా ఆరాధనీయుడైన ఎన్టీఆర్‌ పేరును ఆయన స్థాపించిన హెల్త్‌ యూనివర్శిటీకి తొలగించడం దారుణమైన చర్యగా పేర్కొన్నారు. తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని పొందిన మహనీయుడికే కాక, ఇది మొత్తం తెలుగు జాతికి జరిగిన అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్య ప్రభుత్వ కుసంస్కారాన్ని తెలుపుతుందన్నారు. ప్రజలమీద రౌడీలను పంపి బెదిరించి, భయపెట్టి పాలన సాగిస్తున్న జగన్‌, ఈ చర్యను కూడా అదే బలప్రయోగంతో ఆమోదింప చేయాలనుకున్నాడో ఏమో తెలియదన్నారు. కానీ ఎన్టీఆర్‌ పేరెత్తినా, ఆయనకు చిన్నపాటి అవమానం జరిగినా భరించలేని తెలుగువారు తెలుగు రాష్ట్రాల్లోనేకాక, ప్రపంచమంతా విస్తరించి ఉన్నారని, వారిని బెదిరింపులతో, దౌర్జన్యాలతో లొంగదీసుకోవాలను కోవడం జగన్‌ తరం కాదన్నారు. వెంటనే ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రజాపోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి.ఎస్‌.మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు వ్యక్తి గత కార్యదర్శి పి.మనోహర్‌, కుప్పం రూరల్‌ మండల అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, సత్యేంద్రశేఖర్‌, త్రిలోక్‌, తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు మణితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T04:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising