ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు త్వరగా కోలుకోవాలి..

ABN, First Publish Date - 2022-01-20T05:18:03+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని మదనపల్లెలో టీడీపీ నాయకులు సర్వమత పార్థనలు నిర్వహించారు. పుంగనూరు రోడ్డులోని కనుమలో గంగమ్మ ఆలయంలో దొమ్మలపాటి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చంద్రబాబు,లోకేశ్‌ త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు చేస్తున్న పఠాన్‌ఖాదర్‌ఖాన్‌, మత గురువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె, తంబళ్లపల్లెల్లో టీడీపీ నాయకుల ప్రార్థనలు


మదనపల్లె టౌన్‌, జనవరి 19: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని మదనపల్లెలో టీడీపీ నాయకులు సర్వమత పార్థనలు నిర్వహించారు. బెంగళూరు బస్టాండులో టీడీపీ మైనార్టీ నేత పఠాన్‌ఖాదర్‌ఖాన్‌ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మతపెద్దలు, క్రిస్టియన్‌ ఫాదర్లు, హిందూ పూజారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. వైసీపీ అరాచక పాలనను అరికట్టాలంటే చంద్రబాబు అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు.  రాజంపేట పార్లమెంట్‌ క్రిస్టియన్‌ మైనార్టీ అధ్యక్షుడు దేవారమేశ్‌, నిరంజన్‌ నాని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని, ఆయన ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ పేర్కొన్నారు. బుధవారం పుంగనూరు రోడ్డులోని కనుమలో గంగమ్మ ఆలయంలో దొమ్మలపాటి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమశేఖర్‌, కత్తి లక్ష్మన్న, చంద్రారెడ్డి, వినోద్‌, విద్యాసాగర్‌, విజయమ్మ, ఉషారాణి పాల్గొన్నారు.


తంబళ్లపల్లె: టీడీపీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి  లోకేశ్‌... కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తంబళ్లపల్లె తెలుగుతమ్ముళ్లు మల్లయ్యకొండలో పూజలు నిర్వహించారు. బుధవారం నరసింహులు, మ్యూజికల్స్‌ శివ, టైల్స్‌ శీన తదితరులు మల్లయ్యకొండకు చేరుకుని చంద్రబాబు, లోకేశ్‌ కరోనా నుంచి కోలుకుని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు.

Updated Date - 2022-01-20T05:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising