ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో విధ్వంసకరమైన పాలన..ధర్మపోరాటం తప్పనిసరి: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-01-07T17:30:54+05:30

చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు శుక్రవారం పర్యటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు శుక్రవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి  విధ్వంసకరమైన పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరమైన పాలన పోవాలంటే ధర్మపోరాటం తప్పనిసరని.. టీడీపీ ఇప్పుడు అదే చేస్తోందన్నారు. ధర్మ పోరాటానికి ప్రతి ఒక్కరూ కలసి రావాలని పిలుపిచ్చారు. పొత్తులు ఉన్నప్పుడు గెలిచామని, లేనప్పుడూ గెలిచామన్నారు. పొత్తులపై వైసీపీ మాట్లాడుతున్న తీరు పనికిమాలినవని విమర్శించారు. 


జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఓటీఎస్‌లాగా జగన్‌కు వన్ టైం పాలన ప్రజలు అందించారన్నారు. రౌడీ రాజ్యం, గూండా రాజ్యం, దోపిడి రాజ్యం, దుర్మార్గమైన పాలన రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు. కుప్పం ప్రజలకు తనకు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందని, అలాంటి దాన్ని గుండా వైసీపీ వచ్చి చెడగొట్టిందని, అందుకే ఇప్పుడు ఎమోషనల్‌గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జగన్ అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా ఆరోగ్యపరంగా, విద్యాపరంగా అనేక సేవా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-07T17:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising