ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలమనేరు ఎల్‌ఆర్‌ఎ్‌సకు బ్రీడ్‌కన్జర్వేషన్‌ అవార్డు

ABN, First Publish Date - 2022-12-16T01:13:59+05:30

రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిధిలోని పలమనేరు లైవ్‌స్టాక్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (ఎల్‌ఆర్‌ఎ్‌స)కు 2022కి సంబంధించి బ్రీడ్‌ కన్జర్వేషన్‌ అవార్డు లభించింది. ఈమేరకు వర్సిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌(డీఆర్‌) ప్రొఫెసర్‌ కె.సర్జన్‌రావు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య), డిసెంబరు 15: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిధిలోని పలమనేరు లైవ్‌స్టాక్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (ఎల్‌ఆర్‌ఎ్‌స)కు 2022కి సంబంధించి బ్రీడ్‌ కన్జర్వేషన్‌ అవార్డు లభించింది. ఈమేరకు వర్సిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌(డీఆర్‌) ప్రొఫెసర్‌ కె.సర్జన్‌రావు వెల్లడించారు. అంతరించి పోతున్న పుంగనూరు జాతి పశువుల పరిరక్షణకు చేస్తున్న పరిశోధనకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌) ఈ అవార్డును ప్రకటించిందని తెలిపారు. కిసాన్‌ దివస్‌ సందర్భంగా ఈనెల 23న న్యూడిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు కింద ప్రశంసాపత్రం, నగదు బహుమతి ప్రదానం చేస్తారన్నారు. ఈజాతి పశువుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.60కోట్లతో కార్యాచరణ రూపొందించిందని, మూడేళ్లలో 176 పుంగనూరు దూడలు జన్మించాయని వివరించారు. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎ్‌సలో 268పుంగనూరు జాతి పశువులు ఉన్నాయని..నాలుగుకేటగిరీల్లో ఐసీఏఆర్‌ జాతీయస్థాయి అవార్డులను ప్రకటించగా కేటిల్‌ కేటగిరీలో పుంగనూరుజాతికి ఈఅవార్డు లభించిందని పేర్కొన్నారు. కాగా.. పుంగనూరుతోపాటు ఒంగోలు, ముర్రాజాతి పరిరక్షణకు వర్సిటీలో జరిగే పరిశోధనను ఐసీఏఆర్‌కు పంపామని.. వీటిలో ఈఏడాదికి పుంగనూరు జాతికి అవార్డు వచ్చిందన్నారు.

Updated Date - 2022-12-16T01:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising