ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గాదేవిగా బోయకొండ గంగమ్మ

ABN, First Publish Date - 2022-10-04T05:13:16+05:30

దసరా మహోత్సవంలో భాగంగా బోయకొండ గంగమ్మ సోమవారం దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి పెద్దిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దసరా మహోత్సవంలో భాగంగా బోయకొండ గంగమ్మ సోమవారం దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రెండు చేతులలో శంఖు చక్రాలు, మరో రెండు చేతులలో విల్లంబులు, చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమలం, మరో చేతిలో గద, ఇంకో చేతిలో త్రిశూలం, అష్ట భుజాలతో అమ్మవారిని అలంకరించారు. స్వర్ణాభరణాలతో దుర్గాదేవిగా, పులిపై అమ్మవారిని అధిష్ఠింపచేశారు. దీప, ధూప నైవేద్యం సమర్పించారు. అమ్మవారి అద్దాల మండపం వద్ద ఉత్సవమూర్తిని అలంకరించి, కలశ స్థాపన చేసి ప్రత్యేకంగా అలంకరించారు. మహా గణపతి, ఆదిత్యాధి నవగ్రహ, దుర్గ చండీ, మృత్యుంజయేశ్వర, రుద్ర  హోమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్‌ మిద్దింటి శంకరనారాయణ, ఈవో చంద్రమౌళి మంత్రికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

- చౌడేపల్లె

Updated Date - 2022-10-04T05:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising