ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలి: బీజేపీ

ABN, First Publish Date - 2022-01-28T20:59:43+05:30

చిత్తూరు: కాణిపాకం దేవస్థానం ముందు బీజేపీ శ్రేణులు నిరసనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: కాణిపాకం దేవస్థానం ముందు బీజేపీ శ్రేణులు నిరసనకు దిగారు. సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి ఆధ్యర్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాణిపాక ఆలయంలో పురాతన రథచక్రాలు కాల్చివేసిన ఘటనపై మంత్రి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆలయం అధికారుల నిర్లక్ష్యం వల్లే రథ చక్రాలు కాలిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయాలని కాణిపాకం ఆలయ ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.


జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిపాలనను విధ్వంసంతో మొదలుపెట్టారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. కేవలం ఆయన పాలనలోనే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో దాదాపు 120 ఏళ్లకుపైగా స్వామివారికి సేవ చేసిన రథ చక్రాలను దగ్ధం చేస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని భానుప్రకాష్ మండిపడ్డారు.

Updated Date - 2022-01-28T20:59:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising