ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోరక్షణ కోసం మునుగోడు ఉప ఎన్నికల బరిలోకి

ABN, First Publish Date - 2022-08-17T06:53:26+05:30

గోవు రక్షించబడినప్పుడే మనం రక్షించబడతామని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, యుగతులసి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శివకుమార్‌ అభిప్రాయపడ్డారు.

మీడియాతో మాట్లాడుతున్న శివకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శివకుమార్‌


తిరుమల, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): గోవు రక్షించబడినప్పుడే మనం రక్షించబడతామని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, యుగతులసి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శివకుమార్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ అనేకమంది పీఠాధిపతులు, మఠాఽధిపతులు, స్వామిజీలు తిరుపతిలో జరిగిన గోమహాసమ్మేళనంలో కోరారని, అంతకుముందే టీటీడీ బోర్డు కూడా ఇదే అంశంపై కేంద్రానికి లేఖ రాసిందన్నారు. అయితే ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో దేశవ్యాప్తంగా విపరీతంగా గోహత్యలు జరుగుతున్నాయన్నారు. గోసంతతి అంతరించిపోతోందన్నారు. రాజకీయనాయకుల వల్ల గోహత్యలు జరుగుతున్నాయన్నారు. అందుకే ప్రపంచం మొత్తం ప్రస్తుతం ప్రమాదస్థితిలో ఉందన్నారు. గోవును రక్షిస్తేనే మానవాళి బాగుంటుందన్నారు. గోవును జాతీయప్రాణిగా ప్రకటించడం కోసం వేదికగా మునుగోడు ఉప ఎన్నికలను ఉపయోగించుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో యుగతులసి తరుపున తాను బరిలోకి దిగబోతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే గో రాజ్యస్థాపన కోసం వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వచ్చినట్టు చెప్పారు. 

Updated Date - 2022-08-17T06:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising