ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారుపాళ్యం కుర్రోడు హీరో అయ్యాడు!

ABN, First Publish Date - 2022-10-21T05:41:03+05:30

సత్యవేడుకు చెందిన ఓ యువకుడు సినీ హీరోగా రంగప్రవేశం చేశాడు. వర్ధినీ మూవీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో నిర్మితమవుతున్న జెట్టి అనే సినిమాలో సత్యవేడుకు చెందిన మురళీకృష్ణ (మన్యం కృష్ణ) హీరోగా నటిస్తున్నాడు.

మన్యం కృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యవేడు, అక్టోబరు 20: సత్యవేడుకు చెందిన ఓ యువకుడు సినీ హీరోగా రంగప్రవేశం చేశాడు. వర్ధినీ మూవీ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో నిర్మితమవుతున్న జెట్టి అనే సినిమాలో సత్యవేడుకు చెందిన మురళీకృష్ణ (మన్యం కృష్ణ) హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగు అనంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 28న విడుదల కానుంది. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రముఖ నటి నందితా శ్వేత, విలన్‌గా ప్రఖ్యాత తమిళ నటుడు మైమీగోపి నటించారు. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం సమకూర్చగా, కూనపరెడ్డి వేణుమాధవ్‌, పండ్రాజు వెంకటరామారావు నిర్మించారు. ఈ సినిమాలోని ‘దూరం పెరిగినా..... మౌనం కరిగినా’ పాట ప్రేక్షకులను ఇప్పటికే విశేషంగా ఆకట్టుకుంది. కాగా మురళీ కృష్ణ (మన్యం కృష్ణ) పట్టణంలోని మాస్టర్‌ స్కూల్‌లో టెన్త్‌ వరకు చదువుకున్నాడు.చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యానికి చెందిన ఈయన తండ్రి చలపతి నాయుడికి సత్యవేడు ప్రాంతంలో బంధువులు ఉండడంతో ఇరవై ఏళ్ళ క్రితం సత్యవేడుకు వచ్చి స్థిరపడ్డారు.ఆయన మరణానంతరం మన్యం కృష్ణ కుటుంబం తిరిగి బంగారుపాళెం వెళ్లింది. ఈ సందర్భంగా మాస్టర్‌ స్కూల్‌ అధినేతలైన శ్రీనివాసులురెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తమ శ్రేయోభిలాషి చలపతి నాయుడి కుమారుడు మురళీకృష్ణ సినిమా హీరో కావడం సంతోషంగా ఉందన్నారు. మురళీకృష్ణ హీరోగా  రాణించాలని, జెట్టి సినిమా విజయవంతం కావాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - 2022-10-21T05:41:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising