ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రదర్శన

ABN, First Publish Date - 2022-08-08T06:51:56+05:30

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను పురస్కరించుకుని ఆదివారం నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులతో కలిసి జిల్లా విద్యాశాఖ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(విద్య),ఆగస్టు7: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను పురస్కరించుకుని ఆదివారం నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులతో కలిసి జిల్లా విద్యాశాఖ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు.. భరతమాత, జాతీయనాయకుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. చిన్నారుల రింగులవిన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలాజీకాలనీ సర్కిల్‌లోని ఎస్వీయూ క్యాంపస్‌ స్కూల్‌ వద్ద ప్రారంభమైన ఈర్యాలీని డీఈవో శేఖర్‌  ప్రారంభించి, ప్రసంగించారు. విద్యార్థులు చదువుతోపాటు దేశభక్తిని పెంచుకోవాలని సూచించారు. ర్యాలీ టౌన్‌క్లబ్‌ సర్కిల్‌, కృష్ణాపురంఠాణా, గాంధీరోడ్డు మీదుగా నగరపాలకసంస్థ కార్యాలయం వరకు కొనసాగింది. ఎంఈవోలు, హెచ్‌ఎంలు, టీచర్లు, హెచ్‌ఎంల సంఘ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T06:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising