ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటీఎం మోసగాడి అరెస్టు

ABN, First Publish Date - 2022-06-30T06:25:50+05:30

ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం తెలియని వ్యక్తిని మోసగించిన ఓ యువకుడు చివరకు కటకటాలపాలయ్యాడు.

నిందితుడి అరెస్టు చూపుతున్న రాళ్లబూదుగూరు పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాంతిపురం, జూన్‌ 29: ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం తెలియని వ్యక్తిని మోసగించిన ఓ యువకుడు చివరకు కటకటాలపాలయ్యాడు. రాళ్లబూదుగూరు పోలీసుల కథనం మేరకు... తుమ్మిశి పంచాయతీ బుడదసిద్దనపల్లెకు చెందిన మారప్ప శాంతిపురం పట్టణంలోని ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వచ్చాడు. ఏటీఎంలో డబ్బు తీసుకోవడం తెలియని ఆయన అక్కడే ఉన్న యువకుడికి పిన్‌ నెంబర్‌ చెప్పి రూ.1000డ్రా చేసుకున్నాడు. సాయం చేసిన ఆ యువకుడు మారప్ప ఏటీఎం కార్డును తన వద్దే ఉంచుకుని, తన వద్ద ఉన్న వేరే కార్డును ఇచ్చాడు. మారప్ప అక్కడికి నుంచి వెళ్లిపోగానే  ఆ యువకుడు రూ.27,300 డ్రా చేసుకున్నాడు. ఇది గుర్తించిన మారప్ప రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ మునస్వామి కేసు దర్యాప్తును ముమ్మరం చేశాడు. మంగళవారం సాయంత్రం యువకుడు శాంతిపురం యూనియన్‌ బ్యాంకు ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా ఉండటంతో స్టేషనుకు తరలించి విచారణ జరిపారు. మారప్ప ఏటీఎం కార్డు నుంచి తానే డబ్బు డ్రా చేసినట్టు యువకుడు అంగీకరించాడు. అతని నుంచి రూ.27,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-06-30T06:25:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising