ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి కలెక్టర్‌గా వెంకట్రమణారెడ్డి

ABN, First Publish Date - 2022-04-03T08:25:53+05:30

కొత్త జిల్లాల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలను శనివారం రాత్రి ప్రభుత్వం బదిలీ చేసింది. జిల్లా నుంచి పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ కాగా మరికొందరు బయటి నుంచి చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి

 టీటీడీ సీవీఎస్వోగా నరసింహ కిషోర్‌

 అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా 

తిరుపతి కమిషనర్‌ గిరీష 

 తిరుపతి, చిత్తూరు ఎస్పీలు, 

 టీటీడీ సీవీఎస్వో, చిత్తూరు జేసీ బదిలీ

 మరికొందరు ఐఏఎ్‌సలకూ స్థానచలనం 


తిరుపతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలను శనివారం రాత్రి ప్రభుత్వం బదిలీ చేసింది. జిల్లా నుంచి పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీ కాగా మరికొందరు బయటి నుంచి చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రానున్నారు. తిరుపతి జిల్లాకు తొలి కలెక్టర్‌గా విశాఖ మెట్రోపాలిటన్‌ కమిషనరు కె.వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. ఇక, మొదటి ఎస్పీగా సీఎం జగన్‌ వద్ద చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పి.పరమేశ్వర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. తిరుపతి అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ వెంకట అప్పలనాయుడును స్టేట్‌ పోలీస్‌ సెక్యూరిటీ విభాగానికి బదిలీ చేసింది. తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గిరీష.. కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. టీటీడీ సీవీఎస్వో గోపీనాధ్‌ జెట్టి పదోన్నతిపై డీజీపీ కార్యాలయంలో డీఐజీగా నియమితులయ్యారు. ఈయన స్థానంలో ఇంటెలిజెన్స్‌ విభాగం ఎస్పీగా వున్న డి.నరసింహ కిషోర్‌ నియమితులయ్యారు. 

 చిత్తూరు కలెక్టర్‌ హరినారాయణ్‌ అక్కడే కొనసాగుతారు. అక్కడ ఎస్పీగా పనిచేస్తున్న సెంథిల్‌కుమార్‌ పదోన్నతిపై కర్నూలు డీఐజీగా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో చిత్తూరులోనే ఎస్‌ఈబీ అదనపు ఎస్పీగా ఉన్న రిశాంత్‌రెడ్డి నియమితులయ్యారు. 

చిత్తూరు హౌసింగ్‌ జేసీ వెంకటేశ్వర్‌ అక్కడే జాయింట్‌ కలెక్టర్‌గా కొనసాగుతారు. చిత్తూరులోనే డెవల్‌పమెంట్‌ జేసీగా వున్న సీహెచ్‌ శ్రీధర్‌ తూర్పు గోదావరి జిల్లా జేసీగా బదిలీ అయ్యారు. ఇక కొత్త జిల్లా అయిన తిరుపతి జేసీగా ప్రస్తుతం కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న డీకే బాలాజీ నియమితులయ్యారు. 

 మరో ఐఏఎస్‌ అధికారి ఎం.గౌతమి తిరుపతి ఈఎంసీ సీఈవోగా నియమితులవగా చిత్తూరు రెవిన్యూ జేసీ రాజాబాబు ఏపీ యూఎ్‌ఫఐడీసీ స్పెషలాఫీసర్‌గా బదిలీ అయ్యారు.

Updated Date - 2022-04-03T08:25:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising