ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాకంలో జీవ ధ్వజస్తంభానికి సంప్రోక్షణ

ABN, First Publish Date - 2022-12-16T00:54:22+05:30

కాణిపాక వినాయక స్వామి ఆలయానికి అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో జీవ ధ్వజస్తంభానికి గురువారం సంప్రోక్షణ నిర్వహించారు.

మహాపూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చక, పండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 15: కాణిపాక వినాయక స్వామి ఆలయానికి అనుబంధ వరదరాజస్వామి ఆలయంలో జీవ ధ్వజస్తంభానికి గురువారం సంప్రోక్షణ నిర్వహించారు. తొలుత పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు, చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు, సర్పంచి శాంతిసాగర్‌రెడ్డి ప్రధాన ఆలయం నుంచి పూజాద్రవ్యాలను తీసుకొచ్చి వరదరాజస్వామి ఆలయ అర్చకులకు అందించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం నిత్యకైంకర్యం, యాగశాల ఆరాధన, చతుస్థానార్చన హోమం, న్యాసహోమం, మేఖల, శిఖరకుంభ, తత్తన్మూర్థిమంత్ర హోమం, మహాపూర్ణాహుతి, కుంభ ఉద్వాసన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాజగోపుర కలశాలు.. నూతన జీవ ధ్వజస్తంభానికి కుంభ జలంతో అర్చక, పండితులు సంప్రోక్షణ చేశారు. యజమాన మహాదాశీర్వచనం నిర్వహించారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవమూర్తులను కాణిపాక పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్లు జగనాథరెడ్డి, మణి నాయుడు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ కోదండపాణి, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఉభయదారులు పాల్గొన్నారు.

24న ధర్మక్తల మండలి సమావేశం

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సమావేశాన్ని ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు జరిగే సమావేశంలో ఆలయ అభివృద్ధిపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-16T00:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising