ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెటర్నరీ వర్సిటీలో ముగ్గురు ఆఫీసర్ల నియామకం

ABN, First Publish Date - 2022-10-14T06:59:27+05:30

వెటర్నరీవర్సిటీలో మూడు యూనివర్సిటీ ఆఫీసర్ల పోస్టుల నియామకాలకు పాలకమండలి సమావేశంలో ఆమోదించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకమండలి సమావేశంలో ఆమోదం


తిరుపతి(విద్య), అక్టోబరు 13: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీవర్సిటీలో ఖాళీగా ఉన్న మూడు యూనివర్సిటీ ఆఫీసర్ల పోస్టుల నియామకాలకు పాలకమండలి సమావేశంలో ఆమోదించారు. ప్రొద్దుటూరులోని వెటర్నరీకళాశాలలో వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డి అధ్యక్షతన గురువారం పాలకమండలి సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని వెటర్నరీ కళాశాలలో గైనకాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్‌ కె.వీరబ్రహ్మయ్యను వెటర్నరీసైన్స్‌ డీన్‌గా, గన్నవరంలోని ఎన్టీఆర్‌ వెటర్నరీ కళాశాల న్యూట్రిషన్‌ విభాగ హెడ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జేవీ రమణను డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌(డీఎ్‌సఏ)గా, గరివిడి వెటర్నరీ కళాశాల ఏడీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ చెంగల్వరాయలును కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌(సీవోఈ)గా నియమిస్తూ ఆమోదించారు. ఈ మూడు పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువరించి.. ఇటీవల ఇంటర్వ్యూలు నిర్వహించారు. మెరిట్‌, సీనియారిటీ ప్రాతిపదికన నియామకం జరిగినట్లు వర్సిటీ ఉన్నతాధికార వర్గాలు అంటున్నాయి. అలాగే పలు సివిల్‌పనులకు ఆమోదం తీసుకున్నట్లు సమాచారం. కాగా వర్సిటీ పాలకమండలిలో ఐసీఏఆర్‌, వీసీఐ ద్వారా అపాయింట్‌ అయిన ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యుల మూడేళ్ల పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వీరిని పలువురు సభ్యులు అభినందించారు. 

Updated Date - 2022-10-14T06:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising