ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకలి తీర్చే ఆపిల్‌ ఫ్రిడ్జ్‌

ABN, First Publish Date - 2022-01-25T06:37:55+05:30

తిరుపతిలో ఆకలేసినవారు ఇకపై ఎవరి ఇంటి ముందుకో వెళ్లి ఆహారాన్ని అడుక్కోవాల్సిన అవసరం లేదు.

అన్నార్తుడికి ఆహార పొట్లాన్ని అందజేస్తున్న వలంటీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ‘ఫీడ్‌ ది నీడ్‌’ పేరుతో తిరుపతి రైల్వేస్టేషన్‌ వద్ద ఏర్పాటు


తిరుపతి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఆకలేసినవారు ఇకపై ఎవరి ఇంటి ముందుకో వెళ్లి ఆహారాన్ని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆపిల్‌ ఫ్రిడ్జ్‌ డోరు తీస్తే చాలు.. ఆహారం ఉచితంగా దొరుకుతుంది. అవును ఇది నిజమే.. ఒకరికి ఎక్కువైన ఆహారం మకొకరి ఆకలి తీరుస్తుందన్న ఆలోచనతో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ నీలిమ ఆర్య.. ‘ఫీడ్‌ ది నీడ్‌’ పేరుతో ఈ ఆపిల్‌ ఫ్రిడ్జ్‌కి రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఈ ఫ్రిడ్జిని తిరుపతి రైల్వేస్టేషన్‌ దగ్గర ఏర్పాటు చేశారు. స్థానిక దాతల సహకారంతో సేవలందిస్తున్నారు. ఎదుటివారి ఆకలి తీర్చాలన్న ఆలోచన ఉన్నవారంతా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 


ఏం చేయాలంటే..

ఇంట్లో అందరూ తినగా మిగిలిన ఆహారం (అన్నం, పండ్లు వంటివి) లేదా ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని ఒకరిద్దరికి సరిపోయేలా ప్యాక్‌ చేసి తీసుకొచ్చి ఇక్కడి ఫ్రిడ్జిలో పెట్టొచ్చు. శాఖాహారం, మాంసాహారాన్ని వాటికి కేటాయించిన అరల్లో ఉంచాలి. పాడైపోయింది కాకుండా తినగలిగే ఆహారాన్నే ప్యాకింగ్‌ చేయాలి. ఈ కేంద్రం వద్ద ఇద్దరు వలంటీర్లు అందుబాటులో ఉంటారు.

Updated Date - 2022-01-25T06:37:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising