ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21, 22 తేదీల్లో మరో తుఫాన్‌

ABN, First Publish Date - 2022-12-15T00:57:55+05:30

అధికారులు అప్రమత్తంగా ఉండాలని జేసీ ఆదేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 14: వాతావరణ శాఖ సూచనలమేర ఈనెల 21, 22 తేదీల్లో మరో తుఫాన్‌ ప్రభావం జిల్లాపై పడనుందని జేసీ వెంకటేశ్వర్‌ అన్నారు. దీనిపై అధికారులు అప్రమత్తమై వాగులు, వంకలు, కలుజుల వద్ద మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర రెవెన్యూ సిబ్బందితో కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరో తుఫాన్‌ రానున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాండస్‌ తుఫానులో నిరాశ్రయులకు నిత్యావసర వస్తువులు, పునరావాస కేంద్రాల్లోని వారికి ఒక్కో కుటుంబానికి రూ.2 వేలు చొప్పున చెల్లిస్తున్నామని వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అప్‌లోడ్‌ అయిన 3137 దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్‌ 1326 పనులకు అనుమతులిచ్చారన్నారు. ఏపీ సేవా సర్వీసుల నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ.12.15 లక్షలు వసూలు కావాల్సి వుందని, వాటిని చెల్లించేటట్లు చూడాలని తహసీల్దార్లను ఆదేశించారు. 10వ తరగతి, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అందించే సమగ్ర కుల, ఆదాయ సర్టిఫికెట్ల పంపిణీపై సర్వే చేపట్టామని, వాటిని త్వరలో పూర్తిచేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మలివిడతలో అందిన దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. జనవరి 5న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. స్పందన కార్యక్రమానికి అందిన పిటీషన్లను 48 గంటల్లోనే పరిష్కరించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో రాజశేఖర్‌, పలమనేరు ఆర్డీవో శివయ్య, పీఆర్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ రెడ్డి, సీపీవో ఉమారాణి, డీఆర్డీఏ పీడీ తులసి, డీఎస్వో శంకరన్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ, ఐసీడీఎస్‌ పీడీ నాగశైలజ, డీపీవో లక్ష్మి, డ్వామా పీడీ చంద్రశేఖర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising