ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ పాలనలో వ్యవసాయ సంక్షోభం

ABN, First Publish Date - 2022-05-20T05:57:26+05:30

మోదీ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శ డి.రమాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో గురువారం ఏపీ రైతు సంఘం తిరుపతి జిల్లా ప్రథమ సభలు ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


19ఎస్‌కెటి4) సమావేశంలో మాట్లాడుతున్న రమాదేవి

ఐద్వా రాష్ట్ర కార్యదర్శ డి.రమాదేవి

శ్రీకాళహస్తి, మే 19: మోదీ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో చిక్కుకుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శ డి.రమాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో గురువారం ఏపీ రైతు సంఘం తిరుపతి జిల్లా ప్రథమ సభలు ప్రారంభమయ్యాయి. మొదట పురపాలక సంఘ కార్యాలయం నుంచి సుందరయ్య భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల రైతుల మెడకు ఉరి బిగించడమేనని చెప్పారు. ఉచిత విద్యుత్‌కు మంగళం పలికినట్లేనని హెచ్చరించారు. గడప గడపకూ ప్రచారానికి వచ్చే అధికార పార్టీ నాయకులను ఆ గడపల నుంచే తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. మోదీ పాలనలో దేశం అప్పుల భారతమైందని, రాష్ట్రం ఆత్మహత్యలాంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను రద్దుచేసి కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ మాట్లాడుతూ దేశంలో ఆత్మహత్యల రేటు 14శాతంగా ఉందని వాపోయారు. మోదీ మెడలు వంచేందుకు  రైతుసంఘ సభల ద్వారా కార్యా చరణ సిద్ధంచేస్తున్నట్లు తెలిపారు. కాగా అంతకుముందు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హేమలత, జిల్లా కార్యదర్శి జనార్ధన్‌, జిల్లా మాజీ కార్యదర్శి అంగేరి పుల్లయ్య, రంగయ్య, బాలగురవయ్య,  మణి,  గురవయ్య, సురేష్‌, గురవమ్మ, కుప్పమ్మ, బాలకృష్ణ, వేణు, రమేష్‌, వెంకటేష్‌, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-20T05:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising