ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవ భారత యువసైన్యం అగ్నిపథ్‌

ABN, First Publish Date - 2022-06-27T05:04:12+05:30

నవ భారత యువసైన్యం అగ్నిపథ్‌ అని దేశంలోని యువకులందరూ అగ్నిపథ్‌లో చేరాలని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్‌.పి. సింగ్‌భాగెల్‌ పిలుపునిచ్చారు.

ప్రసంగిస్తున్న కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్‌భాగెల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 యువకులు అగ్నిపథ్‌లో చేరాలని కేంద్ర సహాయమంత్రి పిలుపు

తిరుపతి(పద్మావతినగర్‌), జూన్‌ 26: నవ భారత యువసైన్యం అగ్నిపథ్‌ అని దేశంలోని యువకులందరూ అగ్నిపథ్‌లో చేరాలని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్‌.పి. సింగ్‌భాగెల్‌ పిలుపునిచ్చారు. తిరుపతి బీజేపీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో స్థానిక ఓ ప్రైవేటు హోటల్లో ఆదివారం జరిగిన న్యాయవాదుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిపథ్‌ ఎంప్లాయిమెంట్‌ స్కీం కాదని, దేశంలోని యువకులకు దేశభక్తి, క్రమశిక్షణ, దేశ రక్షణ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి యువతను దేశ రక్షకులుగా మలిచే బృహత్తర కార్యక్రమమన్నారు. నాలుగేళ్ల శిక్షణ కాలంలో వారికి రూ. 11 లక్షల స్టైఫండ్‌  అందిస్తామన్నారు. శిక్షణానంతరం అగ్నివీర్‌లు భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో పనిచేయవచ్చన్నారు. ఇంకా సీఆర్‌పీఎఫ్‌, పోలీసు శాఖల్లో చేరేందుకు వారికి 10 శాతం రిజర్వేషన్‌ ఉంటుందని వివరించారు. వ్యాపారం చేసుకోవాలను కుంటే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తామని తెలిపారు. కొంతమంది అగ్నిపథ్‌పై దుష్ప్రచారం చేస్తున్నా రన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక న్యాయశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. అనేక స్పెషల్‌ కోర్టులను ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కో- కన్వీనర్‌ అజయ్‌కుమార్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్‌, బీజేపీ తెలంగాణ లీగల్‌సెల్‌ కో-కన్వీనర్‌ రవీంద్ర విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-27T05:04:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising