ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

96 గ్రామాల్లో చురుగ్గా స్వామిత్వ పనులు

ABN, First Publish Date - 2022-11-25T00:05:36+05:30

జిల్లావ్యాప్తంగా 96 గ్రామాల్లో స్వామిత్వ పనులు చురుగ్గా సాగుతున్నాయని, మరో రెండు గ్రామాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 24: జిల్లావ్యాప్తంగా 96 గ్రామాల్లో స్వామిత్వ పనులు చురుగ్గా సాగుతున్నాయని, మరో రెండు గ్రామాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అన్నారు. గురువారం అమరావతి నుంచి పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పంచాయతీరాజ్‌ విభాగాల పనులపై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 1,928 మంది క్లాప్‌మిత్రలు స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. 884 గ్రామాల్లో బృంధావనాలు ఏర్పాటు కాగా మరో 113 నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపగా, 98 మంజూరయ్యాయన్నారు. కమిషనర్‌ మాట్లాడుతూ సర్పంచులు 15వ ఆర్థికసంఘం నిధుల నుంచి విద్యుత్‌ బిల్లులను 24 గంటల్లోగా చెల్లించేటట్లు చూడాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జేజే వెంకటేశ్వర్‌, ట్రైనీ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, డీపీవో లక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగజ్యోతి, డ్వామా పీడీ చంద్రశేఖర్‌, డీఆర్డీఏ పీడీ తులసి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:05:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising