ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమామహేశ్వరిని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-25T06:59:07+05:30

చిత్తూరుకు చెందిన దళిత మహిళ ఉమామహేశ్వరిపై దొంగతనం నింద మోపి, ఆమెను వేధించిన అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

ఆందోళన చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, జనవరి 24: చిత్తూరుకు చెందిన దళిత మహిళ ఉమామహేశ్వరిపై దొంగతనం నింద మోపి, ఆమెను వేధించిన అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణ నాలుగు రోడ్ల కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉమామహేశ్వరి కేసుకు సంబంధించి కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌తో సరిపోదని గుర్తుచేశారు. ఇందులో తప్పుడు ఫిర్యాదు చేసిన జిల్లా జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌రెడ్డి, పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ మహిళపై థర్డ్‌డిగ్రీ ఉపయోగించడం దారుణమనీ, బాధితురాలికి ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ధరణికుమార్‌, శ్రీనివాసులు, మహేష్‌, బోదేషావలి, మౌలా, సుభాష్‌, మల్లికార్జున, వెంకట్రామయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T06:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising