అభిషేకం టికెట్ ధర పెంచడంలేదు
ABN, First Publish Date - 2022-10-07T06:26:53+05:30
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మూలవిరాట్‌కు నిర్వహించే అభిషేకం ధరలను పెంచడం లేదని పాలక మండలి చైర్మన్ మోహన్‌రెడ్డి గురువారం స్పష్టంచేశారు.
ఐరాల(కాణిపాకం), అక్టోబరు 6: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మూలవిరాట్‌కు నిర్వహించే అభిషేకం ధరలను పెంచడం లేదని పాలక మండలి చైర్మన్ మోహన్‌రెడ్డి గురువారం స్పష్టంచేశారు. అభిషేకం టికెట్ ధరను రూ.5000కు పెంచుతున్నట్లు సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. స్వామికి నిర్వహించే అభిషేకం ధరలు ఎప్పటిలాగానే సామాన్యులకు అందుబాటులో రూ.700 గానే ఉంటుందన్నారు. ఆలయ ప్రతిష్ఠకు భగం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే సహించేది లేదన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్ధి కోసం పాటుపడుతుందన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు మరిన్ని సేవలు అందించడానికి కృషి చేస్తుందన్నారు. అలయం ఎంత అభివృద్ధి చెందితే చుట్టుపక్కల గ్రామాలతో పాటు అందరూ బాగుపడతారన్నారు.
Updated Date - 2022-10-07T06:26:53+05:30 IST