చెరకు ట్రాక్టరు ఢీకొని టీచరు దుర్మరణం
ABN, First Publish Date - 2022-12-31T00:35:45+05:30
విజయపురం మండలం కాళికాపురం మలుపు వద్ద శుక్రవారం సాయంత్రం చెరకు ట్రాక్టరు ఢీకొని ఉపాధ్యాయుడు మధుసూదన్‌రెడ్డి(51) మృతి చెందారు. ఈయన విజయపురం ఉన్నత పాఠశాలలో ఐదేళ్లుగా ఫిజిక్స్ బోధిస్తున్నారు.
విజయపురం, డిసెంబరు 30: విజయపురం మండలం కాళికాపురం మలుపు వద్ద శుక్రవారం సాయంత్రం చెరకు ట్రాక్టరు ఢీకొని ఉపాధ్యాయుడు మధుసూదన్‌రెడ్డి(51) మృతి చెందారు. ఈయన విజయపురం ఉన్నత పాఠశాలలో ఐదేళ్లుగా ఫిజిక్స్ బోధిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. మరో టీచరు ధరణితో కలిసి ఈయన ద్విచక్రవాహనంలో నగరికి బయలు దేరారు. కాళికాపురం మలుపు వద్ద.. నగరి వైపు వెళ్తున్న చెరకు ట్రాక్టరును దాటే ప్రయత్నంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయారు. మధుసూదన్‌రెడ్డిపై ట్రక్కు టైరు ఎక్కి దిగడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్రవాహనంలో వెనుక కూర్చుని ఉన్న ధరణికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం నగరి ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
Updated Date - 2022-12-31T00:35:48+05:30 IST