ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవగాహన లేని పరిపాలనతో అంధకారంలోకి రాష్ట్రం

ABN, First Publish Date - 2022-12-07T00:02:48+05:30

అవగాహనలేని పరిపాలన కారణంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి లేక అంధకారంలోకి వెళ్తోందని మాజీమంత్రి అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేటలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

శంకర్రాయలపేటలో పర్యటిస్తున్న అమరనాథరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపంజాణి, డిసెంబరు 6: అవగాహనలేని పరిపాలన కారణంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి లేక అంధకారంలోకి వెళ్తోందని మాజీమంత్రి అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేటలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక్క చాన్స్‌ అంటూ రాష్ట్ర ప్రజలను అడుక్కుని గద్దెనెక్కి ఆ తరువాత జనాన్ని అన్ని రకాలుగా మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. అవినీతి, అంధకారంలోకి వెళ్లిన విద్యావ్యవస్థ, నిరుద్యోగ సమస్య, తరలిపోతున్న పరిశ్రమలు, పెరుగుతున్న అప్పులతో రాష్ట్రం ఊబిలోకి వెళ్తోందన్నారు. నిరుద్యోగ సమస్యను తీర్చాలని ప్రయత్నించిన అమరరాజా సంస్థ యాజమాన్యాన్ని రకరకాల కారణాలతో తరిమికొట్టారన్నారు. వైశాల్యం, జనాభా పరంగా మన రాష్ట్రానికి రెండింతలున్న పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు ఒకే రాజధాని ఉందని అయినా అవి అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధితో ముందుకు పోతున్నాయన్నారు. అభివృద్ధి చేయడం చేతకాక ప్రజలను పక్కదోవ పట్టించడానికి వికేంద్రీకరణ పేరుతో రాజధాని లేని రాష్ట్రంగా మార్చి ప్రాంతీయ విభేధాలు రెచ్చగొడుతున్నారన్నారు. సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా అంటూ గొంతు చించుకున్న వైసీపీ అధినేత జగన్‌ అధికారం రాగానే కనీసం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ పర్యటించారు. పార్టీ మండల అధ్యక్షుడు ఆనందకుమార్‌, ప్రధాన కార్యదర్శి చలపతి, తెలుగు యువత అధ్యక్షుడు నాగరాజరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సుబ్రమణ్యం, సర్పంచు రుద్రమూర్తినాయుడు, ముబారక్‌తాజ్‌, గంగప్ప, మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising