ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీడిమాకులపల్లె, దోనిమాకుల చెరువు వద్ద ఏనుగుల మంద

ABN, First Publish Date - 2022-09-30T04:44:43+05:30

రామకుప్పం మండలం సింగసముద్రం గ్రామసమీపంలో మూడు ఏనుగుల మంద రెండు రోజులుగా తిష్ఠవేశాయి. సోమల మండలంలోని అన్నెమ్మగారిపల్లె సమీపంలోని దోనిమాకుల చెరువు వద్ద గురువారం ఏనుగుల మంద పట్ట పగలే సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు

ఏనుగులు ధ్వంసం చేసిన బీన్స్‌ పంటను పరిశీలిస్తున్న కుప్పం అటవీ క్షేత్రాధికారి మదన్‌మోహన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భయాందోళనలో రైతులు


రామకుప్పం/ సోమల, సెప్టెంబరు 29: రామకుప్పం మండలం సింగసముద్రం గ్రామసమీపంలో మూడు ఏనుగుల మంద రెండు రోజులుగా తిష్ఠవేశాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు  చెందుతున్నారు. బుధవారం రాత్రి  రైతులు తిమ్మానాయుడు, మునిరత్నంలకు చెందిన బీన్స్‌, టమోటా, వరి పంటలపై దాడులు చేసి తిన్నంతగా తిని ధ్వంసం చేశాయి. బాదిత రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వడంతో కుప్పం అటవీ క్షేత్రాధికారి మదన్‌మోహన్‌రెడ్డి  సిబ్బందితో కలిసి ధ్వంసమైన పంటలను పరిశీలించారు. ఏనుగుల మంద గ్రామ సమీపంలోని అడవిలో ఉండటం వల్ల రైతులెవరూ రాత్రిళ్లు పొలాల వద్దకు వెళ్లరాదని ఆయన సూచించారు. గురువారం సాయంత్రం ఏనుగుల మంద తిరిగి జీడిమాకులపల్లె  సమీపంలోకి రావడంతో అటవీ అధికారులు ట్రాకర్స్‌ సహాకారంతో వాటిని అటవీ లోతట్టు ప్రాంతానికి తరిమేందుకు ప్రయత్నాలు చేశారు. 



సోమల: మండలంలోని అన్నెమ్మగారిపల్లె సమీపంలోని దోనిమాకుల చెరువు వద్ద గురువారం ఏనుగుల మంద పట్ట పగలే సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. అన్నెమ్మగారిపల్లెకు చెందిన మేకల కాపర్లు, పశువుల కాపర్లు తమ పశువులతో దోనిమాకుల చెరువు వద్దకు వెళ్లడంతో  సమీపంలోనే ఏనుగుల సంచారాన్ని గుర్తించి సమీంలోని మర్రి చెట్టు ఎక్కి వీడియోలు తీసి గ్రామస్తులకు సమాచారం చేరవేశారు. సమీప పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు నుంచి గ్రామానికి పరుగులు తీశారు. గత వారంగా పేటూరు, ఇర్లపల్లె వద్ద మకాం వేసినట్లు రైతులు తెలిపారు. ఈక్రమంలో పొలాల వద్ద వేరుశనగ విత్తుకున్న రైతులు రాత్రి కాపలా వెళ్లలేక పోతున్నామని వాపోతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు. 


Updated Date - 2022-09-30T04:44:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising