ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8,250 కేజీల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN, First Publish Date - 2022-01-22T05:38:11+05:30

అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 8,250 కేజీల రేషన్‌ బియ్యం, లారీని విజిలెన్సు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, జనవరి 21: అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 8,250 కేజీల రేషన్‌ బియ్యం, లారీని విజిలెన్సు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి విజిలెన్సు ఎస్‌ఐ రామస్వామి కథనం మేరకు... తొట్టంబేడు మండలం జ్ఞానాంబకండ్రిగకు చెందిన శివ శ్రీకాళహస్తి తదితరప్రాంతాల్లో పేదల నుంచి తక్కువ ధరకు రేషన్‌బియ్యం సేకరిస్తుంటాడు. అనంతరం ఈ బియ్యాన్ని అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల 8,250 కేజీల రేషన్‌ బియ్యాన్ని 165 బస్తాల్లో నింపి సిద్ధం చేశాడు. వీటిని ఇతరప్రాంతాలకు తరలించేందుకుగాను శుక్రవారం ఆయన ఓ మినీలారీలో శ్రీకాళహస్తి సమీపంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి వద్దకు వచ్చాడు. అక్కడ ఓ లారీలో బియ్యం బస్తాలను మార్చడంపై సమాచారం అందుకున్న తిరుపతి విజిలెన్సు ఎస్‌ఐ రామస్వామి సిబ్బందితో కలసి దాడి చేశారు. అప్రమత్తమైన శివ పరారు కాగా, అక్కడున్న కోనేటి వినయ్‌ను అరెస్టు చేశారు. అక్రమ రవాణా ఘటనలో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో సివిల్‌ సప్లయీస్‌ డీటీ గంగయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising